టైగర్ జిందాహై నుండి తొలి సాంగ్ విడుదల

Tue,November 21, 2017 04:10 PM
Swag Se Swagat Song from TIGER ZINDA HAI

2012 లో కబీర్ ఖాన్ తెరకెక్కించిన 'ఏక్ థా టైగర్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'టైగర్ జిందా హై' . అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్, కత్రినా జంటగా నటించారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, భారీ రేంజ్ లో వ్యూస్ దక్కించుకొని షాకిచ్చింది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్ ఉంది. ఇక డిసెంబర్ 22 చిత్రాన్ని విడుదల చేయనుండగా , టీం ప్రమోషన్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా స్వాగే సే స్వాగత్ అనే పాటని విడుదల చేశారు. ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్న విషయాన్ని ఈ పాట ద్వారా ప్రస్తావించారు. ఈ సాంగ్ లో సల్మాన్ , కత్రినా స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి తాజాగా విడుదలైన సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS