జాఫ‌ర్‌, వితికాల‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు ?

Sun,August 4, 2019 07:26 AM
suspense continues in elimination

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులోను స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. ప్ర‌స్తుతం సీజ‌న్ 3 జ‌రుపుకుంటుండ‌గా, ఈ షోకి నాగ్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూలై 21న ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం రెండో వారానికి చేరుకుంది. తొలి ఎలిమినేట‌ర్‌గా హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌గా, ఈ రోజు రెండో ఎలిమినేట‌ర్ ఎవ‌రో తెలియ‌నుంది. మొత్తం నామినేష‌న్‌లో ఎనిమిది మంది స‌భ్యులు ఉండ‌గా శ‌నివారం ఎపిసోడ్‌లో మ‌హేష్‌, రాహుల్ సిప్లిగంజ్‌, శ్రీముఖి, హిమ‌జ ఎలిమినేష‌న్ నుండి సేఫ్ అయ్యార‌ని నాగ్ తెలిపారు. ఇక ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో వ‌రుణ్ సందేశ్, వితికా, జాఫ‌ర్‌, పున‌ర్న‌వి ఉన్నారు.

నామినేష‌న్‌లో ఉన్న న‌లుగురు స‌భ్యుల‌లో వితికా, జాఫ‌ర్‌ల‌లో ఒక‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ‌తార‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. జాఫ‌ర్ ఎప్పుడు ఇంటికి వెళ‌దామా అనే మూడ్‌లో ఉండ‌డంతో పాటు గేమ్‌లో స‌రిగ్గా పాల్గోని కార‌ణంగా ఆయ‌న‌కి త‌క్కువ ఓట్లు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు వితికా త‌న భ‌ర్త‌ని అడ్డుపెట్టుకొని ఇంట్లో కాస్త పెత్త‌నం చ‌లాయిస్తుంద‌నే అభిప్రాయం నెటిజ‌న్స్ మ‌దిలో మెదులుతుంది. ఈ నేప‌థ్యంలో ఆమెని ఇంటి నుండి పంపించాల‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే జాఫ‌ర్‌, వితికాల‌లో జాఫ‌ర్ ఈ వారం ఇంటి నుండి వెళ‌తాడ‌ని టాక్. చూడాలి మ‌రి గెస్సింగ్ ఎంత వ‌ర‌కు కరెక్ట్ అవుతుందో ?

2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles