బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనున్న సుష్మితా సేన్‌

Thu,November 8, 2018 01:24 PM
Sushmita Sen to marry boyfriend Rohman Shawl next year


హైద‌రాబాద్ : మాజీ మిస్ యూనివ‌ర్స్ సుష్మితా సేన్‌.. పెళ్లి చేసుకోబోతున్న‌ది. బాయ్‌ఫ్రెండ్ రోహ‌మ‌న్ షాల్‌ను వ‌చ్చే ఏడాది ఆమె పెళ్లి చేసుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 27 ఏళ్ల మోడ‌ల్‌ రోహ‌మ‌న్‌తో 42 ఏళ్లు సుష్మితా సేన్ గ‌త కొన్ని నెల‌ల నుంచి డేటింగ్ చేస్తోంది. ఆ జంట ఇప్పుడు ప‌బ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఈ ల‌వ్ బ‌ర్డ్స్ పెళ్లి గురించి ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక స్టోరీ రాసింది. వ‌చ్చే ఏడాది చివ‌రిలోగా ఆ ఇద్ద‌రూ మ్యారేజ్ చేసుకోనున్న‌ట్లు ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. సుష్మితా సేన్ ఇప్ప‌టికే ఇద్ద‌రు అమ్మాయిల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ది. ముంబైలో శిల్పా శెట్టి ఇంట్లో జ‌రిగిన దివాళీ వేడుక‌ల‌కు ఈ జంట హాజ‌రైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుష్మిత కూడా తాజా ఫోటోలోను అప్‌డేట్ చేసింది.

View this post on Instagram

#duggadugga ❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on


4763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS