హేమ‌మాలిని ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన కేంద్ర‌మంత్రి

Wed,January 23, 2019 12:42 PM
Sushma Swaraj praise Hema Malini  Performance

అద్భుతం, న‌మ్మ‌శ‌క్యం కానిది, ఊహించ‌లేనిది.. ఈ మూడు మాట‌లతో హేమ‌మాలిని ప‌ర్‌ఫార్మెన్స్‌ని కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్ అభినందించారు. ప్రవాసి భారతీయ దివస్ సమ్మేళనం సందర్భంగా వారణాసి నగరంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి ఎంపీ హేమ‌మాల‌ని గంగా నృత్యం చేస్తూ వీక్ష‌కుల‌ని అల‌రించారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌నకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సుష్మా.. జీవితంలో ఇలాంటి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న తొలిసారి చూశాను. ఆమె ప్ర‌ద‌ర్శ‌న చూశాక మాట‌లు రావ‌డం లేదు అంటూ హేమ‌మాలిని ప‌ర్‌ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. అసిత్ దేశాయ్ అతని కుమారుడు అలాప్ దేశాయ్ లు హేమ‌మాలిని నృత్యాన్ని కంపోజ్ చేయగా పాటలను సుదేష్ వాడ్కర్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, మీకాసింగ్ లు క‌లిసి ఆలపించారు. ప‌విత్ర గంగా న‌ది చ‌రిత్రని తెలియ‌జేస్తూ, ఆ నది ఎలా క‌లుషితం అవుతుంద‌నే నేప‌థ్యంలో ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న సాగింది.


1929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles