15 కోట్ల డీల్‌కు నో చెప్పిన హీరో!

Fri,January 12, 2018 04:20 PM
15 కోట్ల డీల్‌కు నో చెప్పిన హీరో!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15 కోట్ల డీల్.. కానీ సింపుల్‌గా నో చెప్పేశాడు ఆ హీరో. ఎందుకలా అని అడిగితే ప్రజలకు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. ఎమ్మెస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు సంబంధించిన డీల్ అది. ఇలాంటి యాడ్స్‌పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉత్పత్తులను తాను ప్రమోట్ చేయబోనని సుశాంత్ తేల్చి చెప్పాడు. మూడేళ్ల కాలానికి ఆరు యాడ్స్‌లో కనిపిస్తే.. రూ.15 కోట్లు ఇస్తామని సదరు కంపెనీ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇలాంటి విషయాల్లో తాను చాలా బాధ్యయుతంగా ఉంటానని సుశాంత్ చెబుతున్నాడు. చర్మ రంగుకు సంబంధించిన ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి నేను వ్యతిరేకం. బాధ్యత కలిగిన నటులుగా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని సుశాంత్ చెప్పాడు. నిజానికి ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌పై బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ గతేడాది పబ్లిగ్గానే వ్యతిరేకత వ్యక్తంచేశాడు. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా, నవాజుద్ధీన్ సిద్ధిఖీలాంటి వాళ్లు కూడా వీటిని తప్పుబట్టారు.

2980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS