బ‌న్నీ చిత్రంలో కీల‌క పాత్ర కోసం ఇద్ద‌రు యంగ్ హీరోలు

Sun,April 14, 2019 07:59 AM
sushanth, navdeep plays guest roles in allu arjun 19 movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం నిన్న లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 24 నుండి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెరకెక్కించ‌నున్నాడు. డీజే త‌ర్వాత పూజా హెగ్డే మ‌రోసారి బ‌న్నీ స‌ర‌స‌న క‌థానాయిక‌గా నటించ‌నుంద‌ట‌. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు త్రివిక్రమ్. తాజా చిత్రం కూడా తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామాగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇందులో అల్లు అర్జున్‌కి త‌ల్లిగా ట‌బు న‌టిస్తే, తండ్రిగా స‌త్య‌రాజ్ క‌నిపించ‌నున్నార‌ట‌. ఇక ముఖ్య పాత్ర‌ల కోసం న‌వ‌దీప్‌, సుశాంత్‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. సుశాంత్ క్యారెక్ట‌ర్ స్వాతిముత్యం టైపు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు .

2728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles