బ‌న్నీ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్న సుశాంత్

Fri,June 7, 2019 12:00 PM
sushanth guest role in aa19

అల్లు అర్జున్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం నేటి నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు టీంతో చిత్ర క‌థానాయిక పూజా హెగ్డే క‌ల‌వ‌నుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. అయితే చిత్రంలో సుశాంత్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బన్నీ, పూజా, థ‌మ‌న్, వినోద్‌తో క‌ల‌సి ప‌ని చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఈ చిత్రంతో పాటు త‌ర్వాతి సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ వ‌చ్చే వారంలో ఇవ్వ‌నున్న‌ట్టు సుశాంత్ పేర్కొన్నాడు.

బ‌న్నీ- త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ ఐకాన్ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏక‌కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ జ‌రిపి, వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, ఐకాన్ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు.



1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles