ఐఫా అవార్డులా.. హ‌హ‌హ‌హ‌!

Mon,July 17, 2017 03:30 PM
Sushant Singh Rajput post a cryptic tweet about IIFA Awards

ఐఫా అవార్డుల‌పై ఎంఎస్ ధోనీ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఓ మిస్ట‌రీ ట్వీట్ చేశాడు. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును ఉడ్తా పంజాబ్ సినిమాకుగాను షాహిద్ క‌పూర్ గెలుచుకున్నాడ‌న్న వార్త రాగానే సుశాంత్ ఈ ట్వీట్ చేయ‌డం విశేషం. నిజానికి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రేసులో సుశాంత్ కూడా ఉన్నాడు. త‌న‌కు రాలేద‌న్న కోపంతోనా లేక అందులో మ‌రో అర్థం ఏదైనా ఉందో తెలియ‌దుగానీ.. సుశాంత్ ఓ ట్వీట్ చేశాడు. ఐఫా.. హ‌హ‌హ‌.. అంటూ సింపుల్‌గా అవార్డుల‌పై త‌న ఒపినియ‌న్ చెప్పేశాడు సుశాంత్‌.


ఈ ట్వీట్ ద్వారా అత‌ను ఏం చెప్పాల‌నుకుంటున్నాడన్న‌ది స్ప‌ష్టంకాలేదు. మ‌రో విశేషం ఏమిటంటే.. ఇదే అవార్డుల వేదిక‌పై డ్యాన్స్ షో కూడా ఇచ్చాడు సుశాంత్. 2013లో కాయ్ పొ చె సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడత‌డు. ఐఫా అవార్డుల సెర్మ‌నీకి ముందు కూడా సుశాంత్ మాట్లాడాడు. 2006 నుంచే ఐఫాతో త‌న‌కు అనుబంధం ఉంద‌ని, అప్ప‌ట్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ప‌ర్ఫార్మ్ చేసిన తాను.. 2017లో ఏకంగా బెస్ట్ యాక్ట‌ర్‌కు నామినేట్ అయ్యే రేంజ్‌కు చేరుకున్నాన‌ని సుశాంత్ అన్నాడు.

1886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS