హీరోయిన్‌తో ఛాటింగ్ బ‌య‌ట‌పెట్టిన హీరో

Fri,October 19, 2018 01:32 PM

మీటూ ఉద్య‌మం ఇండియాలో ప్ర‌కంప‌నలు రేపుతున్న క్ర‌మంలో పెద్ద మ‌నుషులుగా చ‌లామ‌ణీ అవుతున్న కొంద‌రి చీక‌టి కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు బ‌య‌ట‌కి వ‌చ్చింది. తన తాజా చిత్రం ‘కిజీ ఔర్‌ మ్యానీ’లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంజ‌న సంఘి అనే యువ‌తి ప‌ట్ల సుశాంత్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని, సెట్స్‌లో ఆమెని ఇబ్బంది పెట్టాడ‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై సుశాంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా హీరోయిన్‌తో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.


మీటూ ఉద్య‌మంలో భాగంగా కొంద‌రు నాపై చేస్తున్న ఆరోప‌ణలు ఎదుర్కోవ‌డానికి నేను వివ‌ర‌ణ ఇచ్చుకోక త‌ప్ప‌దు. మీటూ ఉద్య‌మాన్ని కొంద‌రు వ్య‌క్తిగ‌త విష‌యాల కోసం వాడుకుంటున్నారు. అందుకే అంద‌రికి పూర్తి క్లారిటీ రావాలని సంజ‌న‌కి, నాకు మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం చిత్ర షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుండి అయి పోయేవ‌ర‌కు జరిగింది. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని తెలుసు. కానీ, ఇలా చేయక తప్పడంలేదు. అని సుశాంత్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇక సెప్టెంబ‌ర్ నుండి త‌న ట్విట్ట‌ర్ ఖాతాకి వెరిఫైడ్ మార్క్ లేదు. దీనిని అలుసుగా తీసుకొని కొంద‌రు నా పేరుతో త‌ప్పుడు ఎకౌంట్స్ క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు సుశాంత్.
5977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles