మ‌ల్టీ స్టార‌ర్ మూవీ టీజ‌ర్‌కి టైం ఫిక్స్

Sat,April 13, 2019 11:52 AM
Suriyas Kaappaan Teaser released  tomorrow at 7 pm

ప్ర‌స్తుతం అన్ని భాష‌ల‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగులో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉండ‌గా, త‌మిళంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కప్పాన్‌' మూవీ కోసం అక్క‌డి అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య‌, ఆర్య‌, మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న 'కప్పాన్‌' చిత్రాన్ని కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌ట‌. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తుంది.

ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నార‌ని తాజా స‌మాచారం. చిత్రం దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ నేప‌థ్యంలో ఆ డేట్‌కి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని ఏప్రిల్ 14 సాయంత్రం 7గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. 'కప్పాన్‌' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.కాగా, సూర్య న‌టిస్తున్న మరో చిత్రం ఎన్‌జీకే మే 31న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ర‌కుల్ ప్రీత్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles