ఫ్యాన్స్ ని హెచ్చరించిన సూర్య

Fri,January 19, 2018 03:23 PM
suriya warns to his fans

ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోను సూర్య డౌన్ టూ ఎర్త్ ఉంటారు. ఇటీవల తన తాజా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కాళ్ళకి నమస్కరించి అందరికి షాక్ ఇచ్చాడు సూర్య. అయితే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం తానా సెరందై కూటమ్ చిత్రం తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుదలైంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో కొద్ది రోజులుగా పలు ప్రాంతాలలో జరుగుతున్న సక్సెస్ మీట్ లో పాల్గొంటున్నాడు సూర్య. ఈ నేపథ్యంలో చెన్నైలో పర్యటించిన సూర్యకి అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొందరు హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండడంతో అదుపు తప్పిన ఓ బైక్ సూర్య కారు కింద పడబోయింది. ఈ విషయంపై సూర్య వెంటనే తన అభిమానులకి పెద్ద క్లాస్ పీకారు. హెల్మెట్ లేకుండా రిస్క్ లు ఎందుకు చేస్తున్నారు. మీకేమైన అయితే ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని అభిమానులకి హితోపదేశం చేశారు. సూర్య ప్రస్తుతం తన నిర్మాణంలో కార్తీ హీరోగా చినబాబు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

2055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS