విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి సూర్య సపోర్ట్‌

Wed,November 14, 2018 01:32 PM
suriya supports to Vijay Devarakonda

అతి త‌క్కువ టైంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న న‌టించిన‌ టాక్సీవాలా చిత్రం నవంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. సినిమా రిలీజ్‌కి ముందే మూడు గంట‌లకి పైగా ఉన్న ర‌ష్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో చిత్ర యూనిట్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది. అయితే ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నేను బాధ‌లో ఉన్న‌ప్పుడు నాకు బ‌లాన్ని ఇచ్చేది ఎవ‌రో తెలుసా? మీరే. నా చుట్టూ ఎన్ని శ‌బ్ధాలు విన్నా మీ ప్రేమే గ‌ట్టిగా వినిపిస్తుంది అని ట్వీట్‌లో తెలిపారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ ట్వీట్‌పై త‌మిళ న‌టుడు సూర్య స్పందిస్తూ.. మా అందరి ప్రేమాభిమానులు ఎల్ల‌ప్పుడు ఉంటాయి! ఇవి ఏవి శాశ్వ‌తం కావు. కాని నువ్వు మాత్రం ఎప్ప‌టికి ఇక్క‌డే ఉంటావు. టాక్సీవాలా సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇందుకు విజ‌య్ ల‌వ్ యూ సూర్య స‌ర్ అని అన్నారు. టాక్సీవాలా చిత్రం రాహుల్ సంకృతియాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో ప్రియాంక జ‌వాల్క‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. జీఏ2, యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.3018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles