ప్రేక్ష‌కుల అభిప్రాయాన్ని స్వాగ‌తిస్తున్నా: సూర్య‌

Fri,June 7, 2019 04:43 PM

కథాంశాల ఎంపికలో కొత్త‌దనానికి ప్రాధాన్యతనిస్తూ సూర్య‌ చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని అందుకున్నాయి. యువ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ కథాంశంతో సూర్య నటించిన చిత్రం ఎన్‌జీకే. 7/ జీ బృందావన కాలనీ, అడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ సాధారణ యువకుడికి రాజకీయ చదరంగంలో ఎదురైన ఆటుపోట్లతో దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టిన గోపాలం తన తెలివితేటలు, కుయుక్తులతో ప్రజాభిమానాన్ని సంపాదించి ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడో సందేశాత్మకంగా తెరపై ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్పష్టంగా, సూటిగా చెప్పడంలో తడబడిపోవడంతో సినిమా మొత్తం గతితప్పి సాగుతుంది. దీంతో ఈ చిత్రం సూర్య కెరీర్‌లో ఓ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. తాజాగా ఈ చిత్ర రిజ‌ల్ట్‌పై సూర్య సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఎన్జీకే చిత్ర విష‌యంలో మీరు చూపించిన ప్రేమ, అభిప్రాయాల‌ని నేను స్వాగ‌తిస్తున్నాను. మేము చేసిన కొత్త ప్ర‌య‌త్నాప్పి, న‌టీన‌టుల క‌ష్టాన్ని గుర్తించి ప్ర‌శంసించిన వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు. ఎన్జీకే తెర‌కెక్కించేందుకు శ్ర‌మించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అంటూ సూర్య ట్వీట్ చేశారు2644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles