అజిత్‌కి 'వి' సెంటిమెంట్‌.. సూర్య‌కి 'న్' సెంటిమెంట్

Thu,January 3, 2019 09:48 AM
suriya follows n aentiment

సెంటిమెంట్స్ ఒక్కోసారి సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అవుతాయ‌ని కొంద‌రు విశ్వ‌సిస్తుంటారు. అందుకే హిట్టిచ్చిన ద‌ర్శ‌కుడితో వ‌రుస సినిమాలు చేయ‌డం లేదంటే, క‌లిసొచ్చిన పేరునే అటు ఇటుగా మార్చి సినిమాకి టైటిల్ పెట్ట‌డం చేస్తుంటారు. త‌ల అజిత్ గతంలో 'వి' అక్షరంతో వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు చేశాడు. ఈ చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇవ్వ‌డంతో త‌న తాజా చిత్రానికి కూడా మొద‌ట లెట‌ర్ వి ఉండేలా చూసుకున్నాడు . విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ తాజా చిత్రం తెర‌కెక్కుతుండగా, ఈ చిత్రాన్ని వీరం, వేదాళం, వివేగం సినిమాల‌ ద‌ర్శ‌కుడు శివ‌నే తెర‌కెక్కిస్తున్నాడు.

ఇక సూర్య విష‌యానికి వ‌స్తే ఆయ‌న కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో అయ‌న్‌, మాట్రాన్ పేర్లతో సినిమాలు చేశాడు. ఇందులో అయ‌న్ మంచి విజ‌యం సాధించగా, మాట్రాన్ నిరాశ‌ప‌ర‌చింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడో చిత్రం కాప్పాన్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతుంది. ఇందులో ప్రధానమంత్రిగా నటిస్తున్నారు మోహన్‌లాల్‌. లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌, మేజర్‌ వంటి భిన్నమైన పాత్రలు సూర్య పోషిస్తున్నారు. ఆర్య కీలకపాత్ర పోషిస్తున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సాయేషా కథానాయిక. సముద్రకని విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే ఈ చిత్రానికి గ‌త చిత్రాల మాదిరిగానే ‘న్‌’ సెంటిమెంట్‌తో ఈ చిత్రానికి ‘కాప్పాన్‌’ అనే టైటిల్ పెట్ట‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ‘న్‌’ సెంటిమెంట్ కేవీ ఆనంద్‌- సూర్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

1890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles