కేర‌ళ‌, క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కి సూర్య సోద‌రుల సాయం

Sat,August 17, 2019 09:58 AM
Suriya And Karthi Kind Gesture For People Of Kerala

కొద్ది రోజులుగా కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కి అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొద్ది గ్రామాల‌లో వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో చాలా మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ఆప‌ద‌లో ఉన్న బాధితుల‌కి తాము ఉన్నామ‌నే విష‌యాన్ని గుర్తు చేసే సూర్య సోద‌రులు కేర‌ళ‌,క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కి భారీ విరాళం అందించారు. రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం వారిద్దరు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళం అందించిన‌ట్టు కోలీవుడ్ టాక్. గ‌తంలోను సూర్య సోద‌రులు వ‌ర‌ద బాధితుల‌కి సాయం చేసిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం సూర్య.. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సూరారై పొట్రు అనే చిత్రం చేస్తుండ‌గా, కార్తీ .. బ‌కీయా రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సుల్తాన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

1868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles