7 ఏళ్ళ త‌ర్వాత ఆ హీరోకి జంట‌గా..

Fri,August 23, 2019 09:38 AM
Suriya and Kajal Aggarwal reunite with suriya 39 project

క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌, త‌మిళ స్టార్ హీరో సూర్య ఏడేళ్ల క్రితం అంటే 2012లో మాట్ర‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. తెలుగులో ఈ చిత్రం బ్ర‌ద‌ర్స్ పేరుతో విడుద‌లైంది. ఈ చిత్రానికి అంత‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఈ సినిమా త‌ర్వాత కాజ‌ల్‌, సూర్య మ‌ళ్ళీ క‌లిసి ఏ సినిమా చేయ‌లేదు. అయితే కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం సూర్య 39వ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ట‌. త్వ‌రలోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని చెబుతున్నారు. విశ్వాసం ఫేమ్ శివ ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ బేన‌ర్‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది. కాజ‌ల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. కోమ‌లి అనే త‌మిళ చిత్రంతో మంచి హిట్ కొట్టిన కాజ‌ల్ రీసెంట్‌గా ర‌ణ‌రంగం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.

3251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles