సూర్య 38వ చిత్ర టైటిల్ లుక్ విడుద‌ల‌

Sun,April 14, 2019 06:56 AM
Suriya 38 is Titled as  Soorarai Pottru

త‌మిళ స్టార్ హీరో సూర్య వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్నాడు. ఆయ‌న న‌టించిన ఎన్‌జీకే చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. క‌ప్పాన్ అనే మ‌ల్టీ స్టార‌ర్ కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ చిత్రాన్ని కూడా అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు మేక‌ర్స్‌. అయితే త‌మిళ కొత్త సంవ‌త్సరం ( ఏప్రిల్ 14) సంద‌ర్భంగా సూర్య 38వ చిత్ర టైటిల్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సూర్య నల్ల చొక్కా, తెల్ల పంచె క‌ట్టి విమానం వైపు తదేకంగా చూస్తున్నారు. శూర‌రై పోట్రు అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని గురు ఫేం సుధా కొంగ‌ర తెర‌కెక్కించ‌నున్నారు. సూర్య నిర్మాణంలోనే ఈ మూవీ రూపొంద‌నుంది. శూర‌రై పోట్రు అంటే శూరులను కీర్తించాలన్నది తెలుగు అర్థం. ఎయిర్‌ డెక్కెన్‌ వ్యవస్థాపకులు పైలెట్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘సర్వం తాళమయం’ ఫేమ్‌ అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్‌బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles