సురేష్ రైనా ప్ర‌శ్న‌కి సూర్య స‌మాధానం ఏంటో తెలుసా ?

Wed,May 22, 2019 08:56 AM
Suresh Raina ask a question to Tamil actor Suriya Sivakumar

సినిమాల‌తోనే కాకుండా సామాజిక కార్యక్ర‌మాల‌తోను అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్న న‌టుడు సూర్య‌. తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో సూర్య‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఎన్‌జీకే ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సూర్య 36వ చిత్రం కాగా, ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించింది. చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా నెటిజన్స్‌తో సినిమా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ టీంలో ఆడిన ఇండియన్ క్రికెట‌ర్ సురేష్ రైనా.. సూర్య‌కి ట్వీట్ చేశాడు. మీకు చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో ఏ క్రికెట‌ర్ అంటే ఇష్టం? ఎందుకు అని సూర్య‌ను రైనా ప్ర‌శ్నించాడు.

నాకు మీరు, ధోని అంటే చాలా ఇష్టం. రైనాలో సింగింగ్ స్కిల్స్‌, ధోనిలో డ్రాయింగ్ స్కిల్స్ మ‌రింత ఇష్ట‌ప‌డ‌తాను. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ఎప్ప‌టికీ అభిమానినే. మీ పాప గ్రేసియాతో పాటు అంద‌రిని అడిగాన‌ని చెప్పండి. మ‌నం ఇద్ద‌రం క‌లిసి దిగిన ఫోటోని ఎప్ప‌టికి ప‌దిలంగా దాచుకుంటాను అని సూర్య త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ట్వీట్ చ‌ర్చ హాట్ టాపిక్‌గా మారింది.3189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles