గాసిప్స్‌ను కొట్టిపారేసిన ప్రొడ్యూసర్..

Sun,July 16, 2017 06:26 PM
suresh babu denies rumours on drug mafia


హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి మరికొంత మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యాక్టర్ రానాతోపాటు అతని సోదరుడు అభిరామ్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన వార్తలను నిర్మాత సురేశ్ బాబు కొట్టిపారేశారు. డ్రగ్స్ మాఫియాకు రానా, అభిరామ్‌కు ఎలాంటి సంబంధంలేదని, అవన్నీ వట్టి పుకార్లేనని సురేశ్‌బాబు క్లారిటీ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. తన ఫ్యామిలీకి ఇలాంటి వాటితో సంబంధం లేదని, మరోసారి ఇలాంటి అనవసర పుకార్లను సృష్టించవద్దని సురేశ్ బాబు కోరినట్లు తెలుస్తోంది.

2842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS