సైరా సెట్‌లో త‌న‌యుల‌తో సురేంద‌ర్ రెడ్డి

Fri,January 25, 2019 08:30 AM
Surender Reddy with his little ones in syeraa set

కిక్‌, రేసుగుర్రం, ధృవ వంటి హిట్ చిత్రాల‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు మెగాస్టార్ చిరంజీవితో సైరా అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం చేస్తున్నాడు. భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, త‌మన్నా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇది సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సైరా వంటి పీరియాడిక‌ల్ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి ఎలా తెర‌కెక్కిస్తున్నాడా అనే అనుమానం అంద‌రిలో నెల‌కొంది. అయితే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఇద్ద‌రి పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నా పిల్ల‌ల‌తో సైరా సెట్‌లో అనే కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. సైరా చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌త్న‌వేలు ఉన్నారు.

1770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles