నాగ్ మేన‌కోడ‌లితో అడ‌వి శేష్ వివాహం ?

Wed,February 20, 2019 09:08 AM
Supriya Yarlagadda marriage with adivi sesh

కర్మ అనే చిత్రంతో యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. క్షణం సినిమాతో నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు. రీసెంట్‌గా గూఢ‌చారి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ప్ర‌స్తుతం వెంక‌ట్ కుంచ ద‌ర్శ‌క‌త్వంలో 2 స్టేట్స్ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అడ‌వి శేష్‌కి సంబంధించి చ‌క్క‌ర్లు కొడుతున్న ఓ రూమ‌ర్ అభిమానుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

యంగ్ హీరో అడ‌వి శేష్‌, నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ త్వ‌ర‌లో వివాహం చేసుకోనున్నార‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అడ‌వి శేష్ నటించిన గూఢ‌చారి చిత్రంలో సుప్రియ స్పై అనే క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. ఆ స‌మ‌యంలో వారి మ‌ధ్య ఉన్న స్నేహం ప్రేమ‌గా చిగురించింద‌ని చెబుతున్నారు. అదీ కాక అడ‌వి శేష్ తాజాగా చేసిన ట్వీట్‌లో నా జీవితంలో ఓ అద్భుతం జ‌ర‌గ‌బోతుంది. అదేంటో త్వ‌ర‌లోనే చెబుతాను అని అన‌డంతో అభిమానుల‌లో వీరి వివాహంపై అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.

సుప్రియ హీరో సుమంత్‌కి తోబుట్టువు కాగా, ఇర‌వై ఏళ్ల క్రితం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. ఆ చిత్రం త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె ప్ర‌స్తుతం త‌న మేనమామ నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టుడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయింది. సుప్రియ అడ‌విశేష్ క‌న్నా ఐదేళ్లు పెద్ద‌ది కాగా, వీరి పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంతో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.6821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles