సుప్రీం గ్రీన్‌సిగ్నల్.. పద్మావత్‌కు లైన్ క్లియర్

Thu,January 18, 2018 12:18 PM
సుప్రీం గ్రీన్‌సిగ్నల్.. పద్మావత్‌కు లైన్ క్లియర్

సంజయ్ లీలా భన్సాలీకి పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఆయన తెరకెక్కించిన పద్మావత్ మూవీపై నిషేధం విధించే హక్కు ఏ రాష్ర్టానికీ లేదని సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టంచేసింది. దీంతో జనవరి 25న దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. సీబీఎఫ్‌సీ కొన్ని షరతులతో సినిమా రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ సినిమాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.దీంతో సినిమా నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సినిమాపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అన్ని రాష్ర్టాలు సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

1422

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018