కుటుంబ స‌భ్యుల‌తో 2.0 చిత్రాన్ని వీక్షించిన ర‌జ‌నీకాంత్

Sun,December 9, 2018 07:33 AM
Superstar  rajinikanth WatchED  2Point0 With Wife

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ 2.0 చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌లై ఎంత‌టి ఆద‌ర‌ణ పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న దేశంలోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విజువ‌ల్ వండ‌ర్‌లా శంక‌ర్ ఈ చిత్రాన్నితెర‌కెక్కించ‌గా, ప‌క్షిరాజా పాత్ర‌లో అక్ష‌య్ కుమార్‌, వెన్నెల అనే రోబో పాత్ర‌లో అమీ జాక్స‌న్‌లు న‌టించి మెప్పించారు. అయితే ఈ చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ నిన్న సాయంత్రం త‌న ఫ్యామిలీతో క‌లిసి థియేట‌ర్‌లో వీక్షించారు. ర‌జ‌నీ మ‌న‌వడు, మ‌న‌వ‌రాలు యాత్ర ధ‌నుష్, లింగా ధ‌నుష్‌లు త‌మ తాత‌తో క‌లిసి ఈ చిత్రాన్ని వీక్షించి ఫుల్ హ్య‌పీగా ఫీల‌య్యార‌ట‌. 500 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది చైనాలో 56000కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌ల కానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే .

2342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles