ద‌ర్భార్ తొలి షెడ్యూల్ పూర్తి.. ఇదే నెల‌లో రెండో షెడ్యూల్

Thu,May 16, 2019 08:42 AM

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దర్బార్. చిత్ర తొలి షెడ్యూల్ ముంబైలో జ‌ర‌గ‌గా, రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. వారం రోజుల గ్యాప్ త‌ర్వాత అంటే మే 29న రెండో షెడ్యూల్‌ని మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఒకటి పోలీసు అధికారి పాత్రకాగా, మ‌రొక‌టి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. ఈ చిత్రం అభిమానుల‌కి మంచి ఫీస్ట్ ఇస్తుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

1178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles