రుషికేశ్ ఆశ్రమంలో రజనీకాంత్

Mon,October 14, 2019 02:52 PM


ఉత్తరాఖండ్: తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. రజనీకాంత్ ఇవాళ ఉదయం రుషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వారితో సరదాగా ముచ్చటించారు. ఆశ్రమానికి వచ్చిన వారు తలైవాతో ఫొటోలు దిగారు. గంగానదీ తీర ప్రాంతంలో ఉండే స్వామి దయానంద ఆశ్రమం ప్రముఖ పర్యాటక క్షేత్రం. దయానంద ఆశ్రమంలో వేద, సంస్కృత పాఠాలు, ప్రాచీన కాలంలో ఉన్న రుషుల చరిత్రలను బోధిస్తారు. యోగా తరగతులు కూడా కొనసాగుతుంటాయి.

1963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles