ఐపీఎల్ మ్యాచ్‌లో సంద‌డి చేసిన ర‌జ‌నీకాంత్

Sun,March 24, 2019 08:03 AM
Superstar rajinikanth at Chepauk stadium

శ‌నివారం రాత్రి చెన్నై వేదిక‌గా జ‌రిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంద‌డి చేశారు. చెపాక్ స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కి హాజ‌రైన ర‌జ‌నీ అభిమానుల మ‌ధ్య కూర్చొని మ్యాచ్‌ని వీక్షించారు. ప్ర‌స్తుతం ర‌జనీకాంత్‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆయన సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు.

2501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles