ఆ జాగ్ర‌త్త‌లు తెలిస్తే నేను తీసుకునేవాడిని: ర‌జ‌నీకాంత్‌

Fri,July 13, 2018 09:13 AM
Superstar Rajanikanth says about his hair loss

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ ర‌జనీకాంత్‌. దేశ విదేశాల‌లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ప్ప‌టికి ఆయ‌న సామాన్య వ్య‌క్తిలా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తారు. సినిమాల‌లో ఎంతో స్టైలిష్‌గా ఉండే ర‌జ‌నీకాంత్‌, నిజజీవితానికి వ‌చ్చే స‌రికి పూర్తి వ్య‌తిరేఖంగా ఉంటారు. ఎంత పెద్ద వేడుక అయిన సింపుల్‌గా వెళ‌తారు. ర‌జ‌నీకాంత్‌కి జుట్టు లేకపోయిన ఏనాడు ఆయ‌న బ‌య‌ట విగ్గు ధ‌రించ‌రు. అయితే తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ త‌న హెయిర్‌కి సంబంధించి చ‌మ‌త్కారం చేసి అంద‌రిని న‌వ్వించారు.

చెన్నైలో త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌ముఖ రాజకీయ నేత ఏసీ షణ్ముగన్‌ను డాక్టరేట్‌తో‌ సత్కరించేందుకు ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా తలైవా హాజ‌ర‌య్యారు. త‌న స్నేహితుడైన షణ్ముగ‌న్‌ని స‌త్క‌రించిన ర‌జనీకాంత్ ఆయ‌న గురించి మాట్లాడుతూ.. నాకు 1980 నుండి ష‌ణ్ముగ‌న్ తెలుసు. మా ఇద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. ఈ వ‌య‌సులోను ఆయ‌న ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ముఖంలో చాలా క‌ళ ఉంటుంది. ఎప్పుడు న‌వ్వుతూ ఉంటారు. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ స్టైల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో నాకు తెలిసి ఉంటే నా జుట్టు ఊడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేవాడిన‌ని చ‌మ‌త్క‌రించారు ర‌జనీ. దీంతో అక్క‌డి వారు తెగ న‌వ్వేశారు. ప్రస్తుతం రజనీ..కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే . విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్ క‌థానాయిక‌గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

1534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles