జ‌ర్మ‌నీలో ఫ్యామిలీతో సంద‌డి చేస్తున్న మ‌హేష్

Sat,October 13, 2018 09:27 AM
Superstar Mahesh Holidaying with Family in Germany

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని అశ్వనీదత్, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. అల్లరి నరేశ్, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే చిత్రానికి స్మాల్ బ్రేక్ ఇచ్చిన మ‌హేష్ త‌న ఫ్యామిలీతో క‌ల‌సి జ‌ర్మ‌నీలో సంద‌డి చేస్తున్నాడు. వీరికి సంబంధించిన పిక్స్ కొన్ని బ‌య‌ట‌కి రాగా ఇందులో మ‌హేష్ మీసం లేకుండా స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మ‌హేష్‌ని చూసిన అమ్మాయిలకి నోట మాట కూడా రావ‌డం లేదు. మ‌రి అంత అందంగా ఈ ఫోటోస్‌లో క‌నిపిస్తున్నాడు మ‌హేష్‌. సూప‌ర్ స్టార్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ద‌స‌రా కానుక‌గా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles