కేసీఆర్‌కి హృద‌య‌పూర్వ‌క విజయాభినందనలు: హీరో కృష్ణ

Tue,December 11, 2018 03:07 PM
Superstar Krishna congratulates KCR

హైద‌రాబాద్‌: తెలంగాణ శాస‌న‌స‌భ‌ ఎన్నికల్లో విజ‌య‌దుందుభి మోగించిన గులాబీ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు ప్ర‌ముఖ న‌టుడు కృష్ణ అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేరకు సూపర్‌స్టార్ కృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాలుగున్నరేళ్ల కాలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం. కేసీఆర్‌ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేపడుతున్న క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్‌రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అని కృష్ణ పేర్కొన్నారు.

3125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles