బాలీవుడ్‌లో రీమేక్ కానున్న స‌మంత తాజా చిత్రం

Fri,April 26, 2019 08:52 AM
Super Deluxe remake in bollywood

ఇటు తెలుగు, అటు త‌మిళంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత రీసెంట్‌గా సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ‘మక్కల్ సెల్వన్’గా పిల‌వ‌బ‌డే విజ‌య్ సేతుప‌తి .. స‌మంత‌కి జోడీగా న‌టించారు. ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా రూపొందిన‌ సూప‌ర్ డీల‌క్స్‌లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి క‌నిపించాడు. ఆయ‌న‌ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, సమంత, మిష్కిన్‌, రమ్యకృష్ణ, గాయత్రి, భగవతి పెరుమాల్‌ వంటి పెద్ద తారాగణం ఈ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు కుమారరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నలన్‌ కుమారస్వామి, మిష్కిన్‌, నీలన్‌ శేఖర్‌లు కుమార‌రాజాతో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ఈ మేర‌కు చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. త్యాగరాజ కుమారరాజా ద‌ర్శ‌క‌త్వంలోనే రీమేక్ తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి విజ‌య్ సేతుప‌తి పాత్రకి ఏ బాలీవుడ్ న‌టుడిని ఎంపిక చేసుకుంటారో చూడాలి. సూప‌ర్ డీల‌క్స్ చిత్రంలో ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించి సంద‌డి చేయ‌నుండ‌డం విశేషం.

1358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles