హృతిక్ సూప‌ర్ 30 ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,June 4, 2019 02:53 PM
Super 30 Official Trailer released

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని జూలై 26న విడుద‌ల చేయాల‌ని హృతిక్ భావించాడు. కాని అదే రోజు కంగ‌నా న‌టించిన మెంట‌ల్ హై క్యా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుద‌ల కానుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆసక్తిక‌ర పోటీ జ‌ర‌గ‌నుంద‌ని విశ్లేష‌కులు భావించారు. అయితే కంగానా సోద‌రి రంగోలి కావాల‌నే త‌న అక్క‌కి పోటీగా హృతిక్ త‌న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాడంటూ భ‌గ్గుమంది. దీనిపై హృతిక్ ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇస్తూ రిలీజ్ డేట్ మారుస్తామ‌ని చెప్పుకొచ్చాడు. అన్న‌ట్లుగానే జూలై 12న సూప‌ర్ 30 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. గ‌ణితే శాస్త్ర‌వేత్త‌గా హృతిక్ అద‌ర‌గొడుతున్నాడు. వెండితెర‌పై హృతిక్‌ తొలిసారిగా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వికాస్ బాల్ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles