హృతిక్ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

Wed,September 5, 2018 10:42 AM
Super 30 movie first look released

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ చాలా గ్యాప్ త‌ర్వాత సూప‌ర్ 30 అనే చిత్రం చేసిన‌ సంగ‌తి తెలిసిందే . చివ‌రిగా కాబిల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హృతిక్ ప్ర‌స్తుతం ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా సూప‌ర్ 30 అనే సినిమా చేస్తున్నాడు. సూప‌ర్ 30 స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్ధుల‌ని తీర్చిదిద్దారు ఆనంద్ కుమార్ . పాట్నాలో ఎక‌నామిక‌ల్ బ్యాక్ వ‌ర్డ్ సెక్ష‌న్‌కి చెందిన 30 విద్యార్ధుల‌ని సెల‌క్ట్ చేసి జేఈఈ తోపాటు ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చాడు ఈ ప్ర‌ముఖ ఉపాధ్యాయుడు. ఎంద‌రికో స్పూర్తిని క‌లిగించిన ఆనంద్ కుమార్ బ‌యోపిక్ సూపర్ 30 పేరుతో జ‌న‌వ‌రి 25, 2019న విడుద‌ల కానుంది. అయితే టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో గుబురు గ‌డ్డంతో డీ గ్లామ‌ర్ లుక్‌లో కనిపిస్తున్నాడు హృతిక్. మ్యాథమేటిక్‌ ఫార్ములాతో పోస్టర్‌ను డిజైన్‌ చేసినట్టు కనిపిస్తుండగా పోస్టర్‌ కింద ‘ రాజా కా బేటా రాజా నహీ బనేగా’ అనే క్యాప్షన్‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది. వికాస్ బాహ్ల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, రిల‌యన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై ఈ మూవీ రూపొందుతుంది. సూప‌ర్ 30 చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సూప‌ర్ 30కి పోటీగా కంగనా రనౌత్‌ మణికర్ణిక, ఇమ్రాన్‌ హష్మిల ఛీట్‌ ఇండియాలు విడుద‌ల కానుండ‌డంతో ఈ మూడింటిలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందో అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.


1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles