రెమ్యునరేషన్ చిక్కులు..సన్నీలియోన్ ఈవెంట్ రద్దు

Thu,February 14, 2019 10:29 PM
sunnyleone valentine day event cancelled in kerala

వాలెంటైన్స్ డే సందర్భంగా కేరళలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ తో నిర్వహించేందుకు ప్లాన్ చేసిన కార్యక్రమం రద్దయింది. అంగమలీలోని యాడ్ లక్స్ కన్వెన్షన్ సెంటర్ లో జియాన్ క్రియేషన్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించింది.

అయితే ఈవెంట్ నిర్వాహకులు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో సన్నీలియోన్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె అధికారప్రతినిధి వెల్లడించారు. నిర్వాహకులు ఈవెంట్ కోసం చేసుకున్న ఒప్పందం ప్రకారం నడుచుకోలేదు. అందువల్ల వాలంటైన్స్ డేన సన్నీలియోన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెప్పాడు. ఈవెంట్ నిర్వాహకులు ఈ విషయంపై మాట్లాడుతూ..సన్నీలియోన్ కు మొత్తం 75 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..ఇప్పటికే రూ.70 లక్షలు చెల్లించామని, మిగతా 5లక్షలు ఇవ్వకపోవడంతో సన్నీలియోన్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెప్పారు.

సన్నీలియోన్ తో కలిసి నిర్వహించే ఈవెంట్ పై స్పష్టత ఇచ్చేందుకు త్వరలోనే నిర్వాహకులు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ ను తిరిగి ఏప్రిల్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

1826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles