కూతురు బ‌ర్త్‌డేని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసిన స‌న్నీ దంప‌తులు

Tue,October 15, 2019 10:18 AM

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ 2017 జూలైలో 21 రోజులున్న నిషా కౌర్‌ అనే చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుండి ఆ పాప ఆల‌నా పాల‌న చూసుకుంటూ ప్ర‌తి ఏడాది నిషా బ‌ర్త్‌డేని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. సోమ‌వారంతో నిషా నాలుగో వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా స‌న్నీ లియోన్, డానియ‌ల్ వెబ‌ర్‌లు త‌మ‌ ముద్దుల కూతురి బ‌ర్త్‌డేని సరికొత్త థీమ్‌లో జ‌రిపారు. బ‌ర్త్ డేకి సంబంధించిన ఫోటోల‌ని వారు త‌మ సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. అంతేకాదు పాప కోసం చేసిన షాపింగ్‌కి సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. నిషా కౌర్‌ని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి దత్తత తీసుకున్న సంగ‌తి తెలిసిందే.


2011లో సన్నీ, వెబర్‌లు పెళ్లి పీట‌లెక్క‌గా ఇటీవ‌ల స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చారు. ఆ పిల్ల‌ల‌కి ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టారు. ముగ్గురు పిల్ల‌ల‌తో మా ఫ్యామిలీ ప‌రిపూర్ణ‌మైంది. త‌క్కువ స‌మ‌యంలో మాకింత పెద్ద ఫ్యామిలీ ఇచ్చిన దేవుడికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు అని స‌న్నీ లియోన్ ఆ మ‌ధ్య త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

6594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles