మంచి పని కోసం త‌న పెయింటింగ్ వేలం వేస్తున్న స‌న్నీ

Sat,October 5, 2019 01:14 PM

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీలియోన్ మంచి ప‌ని కోసం ముందుకు వ‌చ్చారు. కుంచె చేత ప‌ట్టుకొని పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్‌ని వేలం వేయ‌మ‌ని ఇచ్చారు. ఆ వ‌చ్చిన మొత్తాన్ని క్యాన్స‌ర్ రోగుల చికిత్స కోసం ఉప‌యోగించ‌నుంది. స‌న్నీ లియోన్ తండ్రి క్యాన్స‌ర్ వ్యాధితో మ‌ర‌ణించిన కార‌ణంగా ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక్కరిలోనైనా అవగాహన తీసుకురాగలిగినా, ఒక్కరి చికిత్సకు అవసరమైన డబ్బులు సమకూర్చగలిగినా... క్యాన్సర్‌పై యుద్ధంలో చిన్న విజయం సాధించినట్టే అని అంటుంది స‌న్నీ. కుంచె చేత ప‌ట్టుకొని ప్ర‌తి గీత గీస్తున్న‌ప్పుడు నాన్న ఆలోచ‌న‌లే. ఆయ‌ని ఎంత‌గానో మిస్ అవుతున్నాను. నిధుల కోసం కాదు. క్యాన్స‌ర్‌పై యుద్దం చేస్తున్న వారిలో ధైర్యాన్ని నింపేందుకు నా జీవితంలో జ‌రిగిన విష‌యాల‌ని స్టోరీలుగా చెప్ప‌బోతున్నాను అని సన్నీ అంటోంది.

1892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles