కూతురి బర్త్‌డే.. బోట్‌లో సన్నీ లియోన్

Mon,October 15, 2018 07:45 PM
Sunny Leone takes daughter Nisha for a boat ride on birthday

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రస్తుతం మెక్సికోలో ఉంది. అయితే తన కూతురు నిషా కౌర్ .. మూడవ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సన్నీ, డానియల్ వెబర్‌లు.. తమ ముద్దుల కూతురు నిషాతో బోట్‌లో విహరించారు. 2011లో సన్నీ, వెబర్‌లు పెళ్లి చేసుకున్నారు. ఆ జంట 21 రోజులున్న నిషాను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నిషా కౌర్‌కు మూడేళ్లు నిండాయి. సన్నీ, వెబర్‌లు సరోగసీ ద్వారా కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. నిషాకు బర్త్‌డే విషెస్ చెబుతూ వెబర్ తన ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు. మా జీవితాల్లోకి నిన్ను తీసుకువచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెబర్ ఆ పోస్ట్‌లో రాశారు. సన్నీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిషాకు గ్రీటింగ్స్ చెప్పింది.6041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles