అపెండిక్స్‌తో ఆసుపత్రిలో చేరిన సన్నీ లియోన్

Fri,June 22, 2018 07:19 PM
Sunny Leone falls sick during MTV Splitsvilla shoot rushed to hospital

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఎంటీవీకి చెందిన స్ప్లిట్స్‌విల్లే సీజన్ 11 షూటింగ్ కోసం సన్నీ ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ షూటింగ్ చేస్తుండగా సన్నీకి కడుపునొప్పి రావడంతో వెంటనే ఉధం సింగ్ నగర్‌లోని బ్రిజేష్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అపెండిక్స్ వల్ల సన్నీకి కడుపునొప్పి వచ్చినట్లు డాక్టర్లు తేల్చారు. తనకు దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం సన్నీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శనివారం ఉదయం తనను డిశ్చార్జ్ చేస్తామని వాళ్లు తెలిపారు.

"సన్నీ అపెండిక్స్‌తో బాధపడుతున్నది. తనను ఆసుపత్రిలో చేర్పించాం. ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నది. ప్రస్తుతానికి సన్నీ షూటింగ్‌లో పాల్గొనట్లేదు.." అని సన్నీ మేనేజర్ తెలిపాడు.

ప్రస్తుతం సన్నీ ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. వీర్‌మహాదేవీ అనే తమిళం సినిమాలో నటిస్తున్నది. ఆ సినిమాలో వీరవనితలా నటిస్తున్న సన్నీ.. ఆ సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తి ఫైట్లను నేర్చుకుంటున్నది. త్వరలో రాబోయే వెబ్ సిరీస్ కరెన్‌జిత్ కౌర్‌లోనూ నటిస్తున్నది.

4012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS