సన్నీ ఫ్లెక్సీపై దుమారం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హాట్ బ్యూటీ

Sat,September 23, 2017 01:27 PM
SUNNY LEONE counter on condom add issue

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియాన్‌తో నవరాత్రిని లింక్ పెట్టి ఇటీవల గుజరాత్‌ లో 'కమ్ ప్లే నవ్ రాత్రి బట్ విత్ లవ్' పేర్లతో కొన్ని ఫ్లెక్సీలు వెలిసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోను ఈ హోర్డింగ్ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో సూరత్‌ లోని హిందూ యువ వాహిని నిరసనకి దిగింది. హోర్డింగ్ లని తొలగించకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని గ్రూప్ నేత నరేంద్ర చౌదరి అన్నాడు. పండుగ సమయంలో సెక్స్ భామతో కండోమ్ ని ప్రచారం చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై సన్నీ తన అభ్యంతరాన్ని తెలియజేసింది. నాన్సెన్స్ .. ఇది కూడా ఓ వివాదమేనా ? అసలు అందులో వల్గారిటీ ఏముంది ? అది ఒక మూములు ప్రకటన మాత్రమే. కాకపోతే కాస్త వినూత్నంగా రూపొందించారంతే. సెక్స్ అనేది మనిషి జీవితంలో సగ భాగం. అది సేఫ్‌ అండ్ హెల్తీగా ఉండాలనే ప్రకటన ద్వారా చెప్పాం. అంతేగాని కండోమ్ వాడకం మహా పాపం అని చెబుతూ, దానిని వివాదం చేస్తే ఎలా అని సన్నీ విమర్శకులకు తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

2130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles