స‌న్నీ లియోన్ రాక‌తో జ‌న‌సంద్రంగా మారిన కేర‌ళ‌

Thu,August 17, 2017 05:57 PM
sunny flat for fans love

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కి కేర‌ళ అభిమానులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ రోజు కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఇనాగ‌రేష‌న్ కోసం అక్క‌డికి వెళ్ళిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. వారి రాక‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు. వీరి ప్రేమ‌కు స‌న్నీ ఫిదా అయింది. కొచ్చి ప్ర‌జ‌లు చూపించిన ప్రేమ‌కు నేను ధ‌న్యురాలిని. వారి ప్రేమ‌ను జీవితంలో ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేను అంటూ కామెంట్ పెట్టి,ఓ వీడియోని పోస్ట్ చేసింది స‌న్నీ. అయితే ఒబామా, ట్రంప్ త‌ర్వాత సన్నీ లియోన్ కోసం ఇంత భారీగా ప్ర‌జ‌లు హాజ‌రు అయ్యారు అంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం భూమి అనే చిత్రంలో ట్రిపి ట్రిపి అనే స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా, బాద్ షా హో చిత్రంలో పియామోర్ అనే ఐటం సాంగ్ చేస్తుంది.

2887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles