20 ఏళ్ల కేసు..కరీష్మా, సన్నీడియోల్‌పై అభియోగాలు

Thu,September 19, 2019 07:22 PM


జైపూర్: రైల్వే ఎమర్జెన్సీ చైన్ లాగిన ఘటనలో రాజస్థాన్ రైల్వే పోలీసులు బాలీవుడ్ నటులు సన్నీడియోల్, కరీష్మా కపూర్‌పై తాజాగా మరోసారి అభియోగాలు నమోదు చేశారు. కరీష్మా, సన్నీడియోల్ 1997లో సినిమా షూటింగ్ సమయంలో 2413-ఏ అప్‌లింక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. దీంతో రైలు 25 నిమిషాలు ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వారిపై 2009లో కేసు నమోదైంది. దీన్ని సవాలు చేస్తూ కరీష్మా, సన్నీడియోల్ తరపు లాయర్ ఏకే జైన్ ఏప్రిల్ 2010లో సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. సెషన్స్ కోర్టులో ఇద్దరు యాక్టర్లకు ఊరట లభించింది.


అయితే తాజాగా సెప్టెంబర్ 17న రైల్వే కోర్టు కరీష్మా, సన్నీడియోల్‌పై అభియోగాలు చేసిందని ఏకే జైన్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. రైల్వే యాక్ట్ లోని 141,145, 146, 147 సెక్షన్లను ఉల్లంఘించారని అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీతారాం మలకర్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. 1997లో భజరంగ్ సినిమా షూటింగ్ నిమిత్తం కరీష్మా, సన్నీడియోల్ చిత్రయూనిట్ అజ్మీర్ జిల్లాలోని సన్‌వర్దా గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles