విదేశాల‌లో స‌న్నీ కూతురి బ‌ర్త్ డే వేడుక‌లు

Thu,October 12, 2017 04:11 PM
sunny celebrates her daughter birthday at foreign

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ , డేనియ‌ల్ వెబ‌ర్ దంప‌తులు ఈ ఏడాది జూలైలో మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌కు చెందిన నిషా కౌర్ వెబ‌ర్ అనే 21 నెల‌ల పాప‌ను ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సన్నీ లియోన్ దంపతులు దత్తత తీసుకున్న నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను తీసుకునేందుకు ఎవరు ముందుకు రాక‌పోగా, 11 కుటుంబాలు వచ్చి చూసి వెనక్కు తిరిగి వెళ్ళాయి. కాని స్కిన్ కలర్, ఆరోగ్య పరిస్థితుల‌ వంటి విషయాలపై ఏ సమాచారం తెలుసుకోకుండానే సన్నీ దంపతులు నిషాని దత్తత తీసుకున్నార‌ని అడాప్షన్ సంస్థ అప్ప‌ట్లో ప్ర‌క‌టించింది. అయితే స‌న్నీ దంప‌తులు ఆ పాప‌ని కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డ‌మే కాదు, వారు ఎక్క‌డికి వెళ్లిన త‌మ వెంట తీసుకెళుతున్నారు. రీసెంట్‌గా త‌న కుటుంబ సభ్యుల‌తో క‌లిసి అరిజోనా వెళ్లిన స‌న్నీ, అక్క‌డే త‌న ద‌త్త‌పుత్రిక నిషా రెండో బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించినట్టు తెలుస్తుంది. నిషా బ‌ర్త్‌డేకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS