ఏఎంబీ సినిమాస్ నోటీసుల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన ఎండీ

Thu,February 21, 2019 07:51 AM

ఏఎంబీ సినిమాస్‌తో మ‌హేష్ బాబు మ‌ల్టీ ప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌ని ర‌న్ చేస్తున్నారు. అయితే కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలను ఏఎంబీ సినిమాస్ అమలు చేయడం లేదని, దీన్ని గుర్తించిన అధికారులు మహేష్‌బాబుకు షోకాజ్ నోటీసులు పంపారని రీసెంట్‌గా ప‌లు వార్తలు వచ్చాయి. దీనిపై ఏషియ‌న్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు. మేము కొత్త జీఎస్టీ నిబంధ‌న‌లని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నాము. మాకు షోకాజ్ నోటీసులు అందాయ‌ని వ‌చ్చిన వార్త‌ల‌లో వాస్త‌వం లేదు. అధికారులు రావ‌డం మాట నిజ‌మే . రికార్డుల‌న్నీ ప‌రిశీలించిన వారు అన్ని నియ‌మాల‌ని స‌రిగ్గానే పాటిస్తున్నార‌ని తెలిపారు. మాకు జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చార‌ని వ‌చ్చిన వార్త‌లు చూసి వారే షాక్ అయ్యార‌ని సునీల్ అన్నారు. ఏఎంబీ సినిమాస్ ద్వారా అధునాత‌న అనుభూతిని క‌లిగించి త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఆనందాన్ని పంచ‌డం చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆయ‌న కూడా ఈ విష‌యంపై ఏమైన స్పందిస్తాడో చూడాలి.

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles