త‌ల్లిదండ్రుల‌కి 90 ల‌క్ష‌ల‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కుర్ర హీరో

Tue,December 3, 2019 08:20 AM

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ మంచి సబ్జెక్ట్‌ల‌ని ఎంచుకుంటూ క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాలు సాధిస్తున్నాడు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న సందీప్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తున్నారు. అడ‌పాద‌డ‌పా నిర్మాత‌గాను త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటూ వ‌స్తున్నాడు. సందీప్ నిర్మించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే అనే చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న నిర్మాణంలో మ‌రిన్ని సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.


సందీప్ రీసెంట్‌గా తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో పాటు ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. హాకీ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే సందీప్ తాజాగా తన త‌ల్లిదండ్రుల‌కి మంచి లగ్జ‌రీ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ 350డి కారును అందుకున్న సందీప్ అమ్మనాన్నలు కనకదుర్గ, పీఆర్పీ నాయుడు చాలా సంతోషించారు. ఈ కారు ధర సుమారు రూ.90 లక్షలు ఉంటుంది.3432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles