రవీంద్రభారతిలో సండే సినిమా

Mon,January 8, 2018 06:38 AM
sunday movie in ravindra bharathi

హైదరాబాద్ : తెలుగు సినిమా ప్రయోగాలకు దూరంగా జరిగి.. సక్సెస్ ఫార్ములా చట్రం లో ఇరికింది. స్టార్ ఇమేజ్ సంకెళ్లతో సామాజిక విలువల్నీ, జీవన సంబంధాల్ని ప్రతిబింబించలేని స్థితికి చేరిపోయింది. మానవ సంబంధాల్ని, సామాజిక విలువల్ని ప్రతిబింబించిన తొలినాటి తెలుగు సినిమా క్రమ క్రమంగా ఆ విలువల్ని కోల్పోతున్నది. బాక్సాఫీస్ హిట్ మినహా మరే ప్రయోజనాన్నీ ఆశించని స్థితిలో సినిమా మానవ సంబంధాల్ని ప్రతిబింబించలేకపోతున్నది. ఈనాటి సినిమాను ఉన్నతమైన పంథావైపు నడిపించేందుకు మొదలైన ప్రయోగం సండే సినిమా. ప్రపంచం కొనియాడిన సినిమాలను సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు చేరువ చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ. ప్రేమ, పెళ్లి, కోపం, పగ, ప్రతీకారంతో ఊరేగుతున్న తెలుగు సినిమాకు కొత్త ఒరవడి ఒకటి నేర్పేందుకు సండే సినిమా పేరుతో ఓ సినీ వినోదానికి తెరతీసింది. సాంస్కృతిక శాఖ చేపట్టిన సినీ వినోద కార్యక్రమాన్ని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ఆదివారం సాయంత్రం ర వీంద్రభారతిలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈనాటి యువతకు కొత్త ఆలోచనా ధోరణిని పెంపొందించేలా సండే సినిమా నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. విదేశీ భాషల్లోని ఉత్తమ సినిమాల్లోని కథనం, నైపుణ్యాలను అర్థం చేసుకుని స్థానిక కథలను ఉత్తమంగా తెరకెక్కించాలని యవతను కోరారు. జపాన్ చిత్రం రషమోన్ ప్రదర్శ న తర్వాత ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ అంబటి సు రేంద్ర రాజు అకిరా కురసావా ప్రతిభను, ఈ సినిమా లో సాంకేతిక నిపుణుల ప్రతిభ, కళాకారుల ప్రతిభను వివరిస్తూ దర్శకుడు కథనాన్ని ఎలా ఆసక్తికలిగేలా రూ పొందించిండో వివరించారు.

ఉత్తమ చిత్రాల ప్రామాణిక వేదిక :

ఈ సినిమా రంగంలో ప్రవేశించిన తెలంగాణ యువతకు, ప్రవేశించాలనుకునే ఔత్సాహిక కళాకారులకు నిజమైన సినిమాను, నిన్నటి ఘనమైన సినిమాను పరిచయం చేసేందుకు సాంస్కృతిక శాఖ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలైన ఉత్తమ చిత్రాలను చూసే అవకాశాన్ని హైదరాబాద్ సినీ అభిమానులందరికీ కల్పిస్తున్నది. ప్రతి ఆదివారం పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రపంచ సినిమాలను ప్రదర్శించేందుకు ఒక టీమ్‌ను, నియమావళితో సాం స్కృతిక శాఖ సిద్ధమైంది. ఏడాది కాలంగా నిర్వహించిన సినివారం కార్యక్రమంలో లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించిన వారంతా ఈ కార్యక్ర మం ద్వారా కథ, కథనం, సాంకేతిక అంశాల్లో తమ లోపాలను సరిదిద్దుకునేలా ప్రపంచ సినిమాలను ప్రదర్శించి, ఆ సినిమాపై ఒక నిపుణుడితో చర్చ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ సండే సినిమాలో ప్రదర్శించేందుకు 50 సినిమాలను సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది.

విదేశీ సినిమాలపై గతంలో అనేక రివ్యూలు రాసిన మామిడి హరికృష్ణ ఈ సినిమాల ఎంపిక బాధ్య త తీసుకున్నారు. సినీ విమర్శ కేటగిరిలో ఆయన మూ డు నంది అవార్డులు అందుకున్నారు. ఏ సినిమాలు ప్రదర్శించాలి, ఎవరు ఆ సినిమా చర్చలో ప్రసంగించాలో హరికృష్ణ నిర్దేశిస్తారు. ఈ సినిమా నిర్వహణకు నరేందర్ గౌడ్ నాగులూరి, అక్షర కుమార్, శివ కట్టా, అట్ల సతీష్‌తో ఒక నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేశా రు. ప్రతి వారం ప్రపంచ సినిమా ప్రదర్శన తర్వాత నిర్వహించే ఈ చర్చ కార్యక్రమాన్ని నిర్వాహకులు యూ ట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సినీ అభిమానులు కూడా ఈ చర్చను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.


ఆదివారం సాయంత్రం నిర్వహించిన తొలి ప్రదర్శనలో సుప్రసిద్ధి సినీ దర్శకుడు అకిరా కురసావా తెరకెక్కించిన రషమోన్‌ను ప్రదర్శించారు. సండే సినిమాలో ఎప్పుడూ ఉత్తమ చిత్రాలనే ప్రదర్శిస్తామని, దీనికి నాలుగు సంస్థలు ఎంపిక చేసిన చిత్రాలను ఎంపికకు పరిశీలించాలని ప్రమాణంగా నిర్దేశించుకున్నామని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ప్రపంచ ఉత్తమ చిత్రాల జాబితా, అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ప్రపంచ ఉత్తమ చిత్రాల జాబితా, టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ ఉత్తమ చిత్రాల జాబితా, వరల్డ్ సినిమా (టీవీ చానల్) రూపొందించిన మరణానికి ముందు సినీ అభిమాని చూడాల్సిన 100 సినిమాల జాబితాలోని చిత్రాలనే ప్ర దర్శనకు పరిశీలిస్తామని, ఇప్పటికి 50 సినిమాలను సేకరించామని హరికృష్ణ వివరించారు.

సినీ వినోదం.. సాంకేతిక విజ్ఞానం
సినిమా పరిశ్రమలో తెలంగాణ యువకులు కొత్త అవకాశాలు వెదుక్కునేందుకు, ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు సాంస్కృతిక శాఖ సినివారం పేరు తో ఏడాది కాలం నుంచి వారం వారం సినిమా ప్రదర్శన నిర్వహిస్తున్నది. రవీంద్ర భారతిలోని ఏడాది పా టు నిర్వహించిన ఈ సినిమా పండుగలో స్థానిక యువకులు నిర్మించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను భౌతికంగా, ప్రేక్షకుల మధ్య ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రివ్యూ థియేటర్‌ను పునరుద్ధరించారు. పాతికేళ్లుగా ప్రదర్శనలేని ఈ థియేటర్ సినివారం కోసం తలుపులు తెరుచుకున్నది. సినివారంలో ప్రదర్శించిన సినిమాల్లో మన యువకులు ఏ కథలను ఎంచుకుంటున్నారు. కథను ఎలా అల్లుకుంటున్నారు? ఎలా తెరకెక్కిస్తున్నారో? గుర్తించేందుకు దోహదపడింది. ఆ అనుభవాలతోనే వాళ్లను వాళ్లే సరిచేసుకునేలా ఈ సండే సినిమాను నిర్వహిస్తామని, అదే విధంగా శనివారం నిర్వహించే సినివారం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సాం స్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నమస్తే తెలంగాణతో అన్నారు.

1320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles