కీర్తితో విడాకుల‌పై నోరు విప్పిన సుమంత్‌

Mon,December 18, 2017 10:17 AM
కీర్తితో విడాకుల‌పై నోరు విప్పిన సుమంత్‌

అక్కినేని నాగార్జున మేన‌ల్లుడు సుమంత్ రీసెంట్‌గా మ‌ళ్ళీ రావా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సుమంత్ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డితో తను విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం వివరించాడు. ఏడాదిన్న‌ర మాత్ర‌మే నిలిచిన సుమంత్‌-కీర్తిరెడ్డిల బంధం విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం... ఇద్ద‌రి వ్య‌క్తిత్వాల‌తో పాటు జీవితాలు కూడా పూర్తి భిన్న‌మ‌ని వారిద్ద‌రు తెలుసుకోవ‌డ‌మేన‌ట‌. క‌లిసి ఉండ‌లేమ‌ని భావించిన వీరిరివురు ఉమ్మ‌డి అంగీకారంతో ..సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నామని సుమంత్ తెలిపాడు. అయితే ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌ల‌తో హ్య‌పీగా ఉంటున్న కీర్తి త‌న‌కి ట‌చ్‌లోనే ఉంద‌ని, కీర్తి కుటుంబం త‌న‌నెంతో గౌర‌విస్తుంద‌ని సుమంత్ పేర్కొన్నాడు. చివ‌రి సారిగా ఏఎన్ఆర్ చ‌నిపోయిన‌ప్పుడు కీర్తి వ‌చ్చి వెళ్ళింద‌ని సుమంత్ అన్నాడు.

14690

More News

VIRAL NEWS