సుమంత్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

Tue,July 18, 2017 05:56 PM
sumanth next project title fixed

బాలీవుడ్ మూవీ విక్కీ డోనార్ రీమేక్ గా న‌రుడా డోన‌రుడా అనే చిత్రంతో సుమంత్ రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోగా ప్ర‌స్తుతం గౌత‌మ్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ఈ మూవీకి మ‌ల్లి రావా అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్టు సుమంత్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియ‌జేశాడు.

ఈ మూవీ టైటిల్ లోగో, టీజర్ ని ఆగ‌స్ట్ 3న విడుద‌ల చేస్తున్న‌ట్టు కూడా పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ న‌టించింది. అన్న‌పూర్ణ‌, కాదంబరి కిర‌ణ్ కుమార్, మిర్చి కిర‌ణ్‌, అభిన‌వ్, అప్పాజీ అంబ‌నిష త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ గౌత‌మ్ తిన్న‌నూరి అందించ‌గా శ్రావ‌ణ్ సంగీతం స‌మ‌కూర్చాడు. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

1537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles