సుమంత్ ఆ పాత్ర చేయడం లేదట..

Mon,July 30, 2018 06:15 PM
Sumanth is not doing ANR Role in NTR

నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర్‌రావు రోల్ లో సుమంత్ నటిస్తున్నాడని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఏఎన్‌ఆర్ పాత్రలో సుమంత్ నటించడం లేదని తాజాగా టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్రలో నటిస్తోంది.

తెలుగు సినిమా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెచ్.ఎం రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, ప్రసాద్‌లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రంలో బీఏ సుబ్బరావు పాత్రను సీనియ‌ర్ న‌రేష్‌, పింగ‌లి నాగేంద్ర‌రావు పాత్రని సంజ‌య్ రెడ్డి, నాగిరెడ్డి పాత్రని ప్రకాశ్ రాజ్ పోషించ‌నున్నట్లు టాక్.

2823
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles