నాగ్ భార్య పోస్ట్ మిస్సైన సుమలత !

Thu,July 21, 2016 12:25 PM
sumalatha reveals nag marriage matter

భార్యాభర్తల మూడుముళ్ల బంధాన్ని ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటే వారితోనే పెళ్లి జరుగుతుంది. అందుకు వ్యతిరేకంగా మనం ఎంత ప్రయత్నించినా జరగదు. సెలెబ్రిటీస్ విషయంలో కూడా అందుకు భిన్నంగా ఏదీ జరగదు. అక్కినేని కుటుంబంలో ఒక తరం కిందటి మాట. నాగార్జునకు ఓ నటిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట నాగేశ్వరరావు. కానీ అది జరగలేదు. ఆ నటి రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ లో ఈ సంగతిని రివీల్ చేసింది.

అక్కినేని నాగేశ్వరరావుకు తన కుమారుడు నాగార్జున పెళ్లి విషయంలో చాలా ఏళ్ల కిందట ఓ ఆలోచన వచ్చిందట. నటి సుమలతను నాగ్ కు ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది? అని నాగేశ్వరరావు అనుకున్నారట. అప్పట్లో నాగార్జున ఫారిన్ లో చదువుకుంటున్నాడు. చదువు పూర్తి కాగానే నాగార్జునకు పెళ్లి చేయాలనుకున్నాడు నాగేశ్వరరావు.

ఓ సినిమా షూటింగ్ లో నాగేశ్వరరావు సుమలతను పిలిచి పెళ్లి మాటలు మాట్లాడారట. మా అబ్బాయి ఫారిన్ లో చదువుకుంటున్నాడు. నీ కలర్, హైట్ కి తగ్గట్టు ఉంటాడు. పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మగారితో మాట్లాడమంటావా?... అని అడిగారట అక్కినేని. ఇంతవరకు ఎవరికీ తెలీని ఈ విషయాన్ని ఇటీవల సుమలత ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

నాగేశ్వరరావు తన కొడుకును పెళ్లి చేసుకోమని అడిగాడని చెప్పిన సుమలత... నాగ్ తో తన పెళ్లి ఎందుకు జరగలేదన్న సంగతి మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏవో కారణాలవల్ల వాళ్లు విడిపోవడం, ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే.

6162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles