రాశీ బాటలో సుమలత

Fri,December 25, 2015 04:37 PM
sumalatha re entry confirmed

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా ఉన్న కొందరు ప్రస్తుతం మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల రాశి కళ్యాణ వైభోగమే చిత్రంతో వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం సుమలత కూడా ఓ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచేందుకు సిద్దమైంది.

అప్పటి హీరోయిన్లు కొందరు బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుండగా మరి కొందరు వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సుమలత రీ ఎంట్రీ అల్లు శిరీష్ సినిమాతో జరగనుంది. ఒకప్పుడు ఖైదీ, చట్టంతో పోరాటం, శృతి లయలు లాంటి చిత్రాలలో హీరోయిన్‌గా అలరించిన సుమలత ఆ తర్వాత రాజ కుమారుడు, శ్రీ మంజునాథ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో పరశురామ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో సుమలత ఓ కీలక పాత్రలో కనిపించనుందట. అయితే ఈ పాత్ర సుమలతకు మంచి పేరు తేవడమే కాక ఫ్యూచర్‌లో మరిన్ని ప్రాజెక్ట్‌లతో ఈమె బిజీగా మారేలా చేస్తుందని చెబుతున్నారు.

4101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles