భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత భావోద్వేగ ట్వీట్‌..

Sun,December 2, 2018 07:40 AM
sumalatha emotional tweet after his husband death

క‌న్న‌డ రెబ‌ల్ స్టార్ అంబరీష్ ఇటీవ‌ల గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి అభిమానుల‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంబ‌రీష్ అంత్య‌క్రియ‌ల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించింది. అంత్య‌క్రియ‌ల‌కి ప‌లువురు సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు భారీగా అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. త‌న భ‌ర్తకి ఇంత ఘ‌నంగా వీడ్కోలు చెప్పిన వారంద‌రిని ఉద్ధేశించి సుమ‌ల‌త సుదీర్ఘ ట్వీట్ పెట్టింది.

‘అంబరీష్ ఓ నటుడు, సూపర్‌ స్టార్‌, కేంద్ర మంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రి. అంద‌రికి మంచి స్నేహితుడు. అన్నింటికీ మించి మీ స్వచ్ఛమైన ప్రేమను పొందిన వ్యక్తి. ఆయన ఈ పుణ్యభూమి కర్ణాటకలో పుట్టే అదృష్టం చేసుకున్నారు. ఆయన మాండ్యకు కుమారుడి లాంటి వారు’ అంటూ సుమలత పేర్కొన్నారు. ‘చీకటితో కూడిన ఈ బాధాకర సమయంలో మీరు చూపిన ప్రేమ, సానుభూతి మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. అంబరీష్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పిన కర్ణాటక ప్రజలకు, అభిమానులకు నేను, నా కుమారుడు అభిషేక్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఆయణ్ని (అంబరీశ్‌) గౌరవిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సుమలత ట్వీట్‌లో తెలిపారు.

పోలీసులు, ఇత‌ర అధికారులు అంతిమ వీడ్కోలు స‌మ‌యంలో ఎలాంటి అవాంత‌రాలు జ‌ర‌గ‌కుండా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మూడు రోజుల వారు ప‌డ్డ క‌ష్టానికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. అంబరీష్‌ను అమితంగా అభిమానించిన మాండ్య ప్రజల ప్రేమ మాటల్లో చెప్పలేనిది’ అని సుమ‌ల‌త ట్వీట్‌లో రాసుకొచ్చారు.


5425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles